నాకు మూఢనమ్మకాలు లేవంటే నమ్మరేం?

•మే 9, 2008 • అభిప్రాయములు

ఈ పూటకి నేను ఫేకు చంద్రబాబు.

నాకు మూఢనమ్మకాలు ఎక్కువని జనాలు అంటుంటారు. ఎటువెళ్ళినా ‘9′ నంబర్ కోసం చూస్తానంటారు. ఎవడో వెధవ చెప్పాడు “సార్, మీరు సి.యం అయ్యి 9 యేళ్ళయ్యింది ఇప్పుడు గాని మీరు ఒక్క వీలగానీ వేశారంటే!!!” అని. పనిలో పనిగా నక్సలైట్లు బాంబు పేల్చారు. ఈ చేతికి ఒక కట్టు కట్టుకొని ప్రచారంచేశా. ఏమైనా ఒరిగిందా? ‘9′ నాకేమైనా కలిసొచ్చిందా? కూడా బి.జె.పి ని తీసుకుని బయల్దేరినా కలిసిరాలేదు. అందరమూ మునిగాము.  అన్నట్టు ఇంకో మాట. నేనీ మధ్య హిందీ నేర్చుకుని వేరే వేరే రాష్ట్రాలకి ప్రచారానికెళ్ళాను. ఒక్కోక్కళ్ళు ఓడిపొతున్నా వేరే వాళ్ళ ప్రచారానికి వెళ్ళకుండా ఉన్నానా? మరి మూఢనమ్మకాలుంటే అలా వెళ్ళేవాణ్ణా? నా అప్తమిత్రుల్ని ముంచేవాణ్ణా? లేదే. మీరు ఇప్పుడు చెప్పండి, నాకు మూఢనమ్మకాలు ఉన్నాయంటారా?

ఆ తిరుపతి సంఘటన గుర్తుకువస్తే గుండె ఝల్లుమంటుంది. దాని గురించి ఇంకోసారి.

ఇట్లు మీ భవదీయుడు,
ఫేకు చంద్రబాబు

హలో…హలో…హలో..

•మే 9, 2008 • వ్యాఖ్యానించండి

హలో…హలో…హలో…

నేనండీ…ఫేకటాల్రావుని. పేరే ఫేకటాల్రావు, ఎప్పుడూ ఫేకుతూనే ఉంటా. నన్ను గూగుల్‌వాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్సు వాడి తయారుచేశాడు. అందుకే నేను మనిషి లాగా ఆలోచిస్తా. ప్రయోగాత్మకంగా నన్ను అంధ్రాలో వదిలారు. అంధ్రాలోనే ఎందుకు వదిలారు అన్నది తర్వాత చెప్తా. నన్ను పూనకాల్రావు అని కూడా అంటారు. అనడానికైతే అంటారు గానీ, నాకు ఎప్పుడూ ఎవరో ఒకరు పూనుతూనే వుంటారు. ఇదో, ప్రస్తుతానికి బ్లాగుల్రావు పూని ఇలా బ్లాగుతున్నానన్నమాట. మీరు మాత్రం మీ పేరు కామెంట్లు రావు అని అనకుండా కామెంట్లు రాస్తుండండి.

ఇట్లు భవదీయుడు,
ఫేకటాలు రావు.