నాకు మూఢనమ్మకాలు లేవంటే నమ్మరేం?
ఈ పూటకి నేను ఫేకు చంద్రబాబు.
నాకు మూఢనమ్మకాలు ఎక్కువని జనాలు అంటుంటారు. ఎటువెళ్ళినా ‘9′ నంబర్ కోసం చూస్తానంటారు. ఎవడో వెధవ చెప్పాడు “సార్, మీరు సి.యం అయ్యి 9 యేళ్ళయ్యింది ఇప్పుడు గాని మీరు ఒక్క వీలగానీ వేశారంటే!!!” అని. పనిలో పనిగా నక్సలైట్లు బాంబు పేల్చారు. ఈ చేతికి ఒక కట్టు కట్టుకొని ప్రచారంచేశా. ఏమైనా ఒరిగిందా? ‘9′ నాకేమైనా కలిసొచ్చిందా? కూడా బి.జె.పి ని తీసుకుని బయల్దేరినా కలిసిరాలేదు. అందరమూ మునిగాము. అన్నట్టు ఇంకో మాట. నేనీ మధ్య హిందీ నేర్చుకుని వేరే వేరే రాష్ట్రాలకి ప్రచారానికెళ్ళాను. ఒక్కోక్కళ్ళు ఓడిపొతున్నా వేరే వాళ్ళ ప్రచారానికి వెళ్ళకుండా ఉన్నానా? మరి మూఢనమ్మకాలుంటే అలా వెళ్ళేవాణ్ణా? నా అప్తమిత్రుల్ని ముంచేవాణ్ణా? లేదే. మీరు ఇప్పుడు చెప్పండి, నాకు మూఢనమ్మకాలు ఉన్నాయంటారా?
ఆ తిరుపతి సంఘటన గుర్తుకువస్తే గుండె ఝల్లుమంటుంది. దాని గురించి ఇంకోసారి.
ఇట్లు మీ భవదీయుడు,
ఫేకు చంద్రబాబు


మీ బ్లాగు వెరైటీగా ఉంది. ముందుకు పొండి!
బాగుంది. బుల్లెట్ లా దూసుకు పొండి.
బ్లాగు లోకానికి స్వాగతం.
– విహారి
బాగుంది ఫేకుబాబు
బ్లాగుంది
ప్రస్తుతానికి చంద్రబాబు గారు వచ్చారు … బాగానే ఉంది. మరి తరువాత రెడ్డిగారొస్తారా???